ఏపీకి కొత్త కష్టం: పరిశ్రమలకు 50శాతం విద్యుత్ కోత

గురువారం, 7 ఏప్రియల్ 2022 (22:25 IST)
power cuts
ఏపీ విద్యుత్ కోతలతో అల్లాడిపోతోంది. ఇళ్లల్లో కరెంట్ కోత ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. ఈ నేపథ్యంలో పరిశ్రమలకు 50శాతం కోత విధిస్తున్నట్లు విద్యుత్‌ అధికారులు అధికారికంగా ప్రకటించారు. 
 
దీనితో పాటు ఒక రోజు పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరా పూర్తిగా ఆపేస్తారు. అంటే పవర్‌ హాలిడే అన్నమాట. రెండు వారాల పాటు విద్యుత్‌ కోత అమల్లో ఉంటుందని అధికారుల తెలిపారు. 
 
కోవిడ్‌ తరవాత అనేక పరిశ్రమలు పని చేయడం ప్రారంభించాయని, దీంతో విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిందని అధికారులు చెప్పారు. అన్ని విధాలుగా విద్యుత్‌ను సమకూర్చుకున్నా.. రోజుకు ఇంకా 40 నుంచి 50 మిలియన్‌ యూనిట్ల కొరత ఏర్పడుతోందని ఏపీ ట్రాన్స్‌కో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అన్నారు
 
ఏప్రిల్‌ 1వ తేదీన 235 మిలియన్‌ యూనిట్ల వినియోగం జరిగిందని, బయటి మార్కెట్‌ నుంచి 64 మిలియన్‌ యూనిట్లను కొనుగోలు చేసినట్లు విద్యుత్‌ అధికారులు తెలిపారు. గత రెండేళ్ళతో పాటు పోలిస్తే విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిందని అంటున్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు