విశాఖపట్టణంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి గ్యాస్ లీకైన ఘటనలో 12 మంది మృత్యువాతపడ్డారు. అలాగే, 500 మందికి పైగా బాధితులుగా మారారు. వందల సంఖ్యలో కోళ్లు, పశువులు, మేకలు, గొర్రెలు చనిపోయాయి. ఈ గ్యాస్ లీక్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఏపీ సర్కారు కోటి రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేసింది.
అలాగే, చంద్రబాబు మాట్లాడుతూ, తెదేపా 38 ఏళ్ల చరిత్రలో 22 ఏళ్లు అధికారంలో.. 16 ఏళ్లు ప్రతిపక్షంలో ఉందని గుర్తుచేశారు. మహానాడులో పాల్గొన్న ఆయన అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.
శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలని దెబ్బతీశారు. వైసీపీ నేతలు ఉన్మాదుల మాదిరిగా వ్యవహరించారు. చేయని తప్పుకు టీడీపీ కార్యకర్తలు జైళ్లకు వెళ్తున్నారు. బెదిరించి లొంగదీసుకునే కుట్రలు చేశారు. ఆర్థికంగా కుంగదీసినప్పటికీ పార్టీని వీడని కార్యకర్తలకు పాదాభివందనం' అని చంద్రబాబు అన్నారు.