ముఖ్యమంత్రివైయస్ జగన్‌ను చూస్తే ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గుర్తొస్తాయని, అదే చంద్రబాబును చూస్తే వెన్నుపోటే గుర్తొస్తుందని ఎమ్మెల్యే విడుదల రజని పేర్కొన్నారు. టీడీపీ రాక్షస పాలనకు బైబై బాబు అంటూ జనం సాగనంపారని ఆమె చెప్పారు.
ఆయనకు ఒక స్టాండ్ అంటూ లేదు. పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ వ్యక్తులకు ఎమ్మెల్సీలు అమ్ముకోవచ్చు అన్న దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబుకు వచ్చింది. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌కు రాజకీయ ఉద్యోగం ఈ శాసన మండలినే ఇచ్చింది.