ప్రజలకు జగన్​ గురించి అర్థమైంది : చంద్రబాబు

శనివారం, 25 జనవరి 2020 (18:23 IST)
ప్రజల గుండెల్లో నుంచి తెదేపాను తుడిచేయడం వైకాపాకు అసాధ్యమని.. తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆ పార్టీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

మండలిలో తెదేపా ఎమ్మెల్సీలు కోట గోడలా నిలబడి ప్రభుత్వ అనైతిక బిల్లులను అడ్డుకున్నారని అభినందించారు. 1984 నాటి పోరాటాన్ని ఎమ్మెల్సీలు తిరిగి గుర్తుచేశారని చంద్రబాబు అన్నారు. తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

1984లో తెదేపా పోరాటాన్ని ప్రపంచం మొత్తం అభినందించిందని చంద్రబాబు గుర్తుచేశారు. ఇప్పుడు తెదేపా ఎమ్మెల్సీలకు ఆ అవకాశం వచ్చిందన్న ఆయన... ఎమ్మెల్సీలు విశ్వసనీయత, విలువలతో నిలబడ్డారని అభినందించారు.

రాజధానుల బిల్లుల వ్యవహారంలో నాటి పోరాటాన్ని గుర్తుచేసిన ఎమ్మెల్సీలను అభినందించారు. పార్టీ కోసం చేసిన త్యాగాలే చరిత్రలో నిలిచి ఉంటాయన్న చంద్రబాబు.. ప్రలోభాలకు లొంగిన వారు తెరమరుగవుతారని స్పష్టం చేశారు.

పార్టీ కోసం పోరాడేవాళ్లకే ప్రాధాన్యం ఉంటుందన్నారు. రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన వాళ్లంతా చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు