నారా లోకేశ్‌ను అడ్డుకోవడం దారుణం.. కొనసాగుతోన్న హౌస్ అరెస్ట్‌లు

శనివారం, 9 సెప్టెంబరు 2023 (11:17 IST)
Nara LOkesh
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో టీడీపీ పార్టీ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేయడం ప్రారంభించాయి. దీంతో, పోలీసులు వారిని ఎక్కడికక్కడ నిర్బంధంలో ఉంచుతున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలను అదుపులోకి తీసుకోగా కొందరిని ఇళ్లల్లోనే అరెస్ట్ చేశారు. 
 
మరోవైపు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోండు శంకర్‌ను అరెస్ట్ చేసి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ కుమార్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు. విశాఖ డాక్టర్ కాలనీలో టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. 
 
టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్ అయ్యారు. అర్ధరాత్రి పూట వచ్చి హంగామా చేయాల్సిన అవసరం ఏముందని, ఏదైనా ఉంటే ముందుగానే నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాల్సిందని చెప్పారు. 
 
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ దుర్మార్గమని అన్నారు. తన తండ్రి వద్దకు వెళ్లకుండా నారా లోకేశ్‌ను పోలీసులు అడ్డుకోవడం దారుణమని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు