రాష్ట్ర శాసనసభలో తాను అలగాజనం అన్న పదాన్ని ఎందుకు వాడాల్సి వచ్చిందో సభలోనే వివరిస్తానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. సభలో ఆ పదాన్ని తాను వాడటంపై, విపక్ష ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం చెబుతూ, సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సభలో వైకాపా సభ్యుల ప్రవర్తన, తాను ఎందుకు అలగాజనం అని అనాల్సి వచ్చిందన్న అంశాలను ప్రస్తావిస్తూ, చంద్రబాబు మరికాసేపట్లో ప్రసంగించనున్నారు. సభలో సీఎం మాట్లాడిన మాటలు తమను అగౌరవపరచడమేనని వైకాపాకు చెందిన దళిళ, ఎస్సీ ఎస్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు.
ఇదిలావుండగా, సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ‘అలగాజనం’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. దీనిపై చంద్రబాబుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో తమ హక్కులకు భంగం వాటిల్లిందని, అందుకే ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు.