వంగవీటి రాధాకు టిక్కెట్ కేటాయించని చంద్రబాబు.. ఎందుకు?

వరుణ్

సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (10:59 IST)
టీడీపీ - జనసేన కూటమిలో భాగంగా, తాజాగా కొన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. అయితే, విజయవాడలో మంచి పట్టున్న నేతగా ఉన్న వంగవీటి రాధాకృష్ణకు టీడీపీ చీఫ్ అధినేత నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ టిక్కెట్ కేటాయించలేదు. తమ నేత పట్ల చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిని రాధా అనుచర వర్గం ఏమాత్రం జీర్ణించుకోలేకపోతూ, లోలోపల రగిలిపోతుంది. నమ్మించి, వాడుకుని, ఆ తర్వాత వారిని కూరలో కరివేపాకులా తీసి పక్కకు పడేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని తాజాగా ప్రకటించిన సీట్ల వివరాలు చూస్తే ఈ విషయం మరోమారు తేటతెల్లమవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. 
 
తాజాగా చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థుల పేర్లలో విజయవాడ సెంట్రల్ సీటు కోసం వంగవీటి రాధా ఆశలుపెట్టుకున్నారు. ఖచ్చితంగా ఆయనకు సీటు ఇస్తారని ఆయన వర్గం నేతలంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఆయనకు వంగవీటి రాధాకు మొండి చేయి చూపించారు. ఇటీవల లోకేశ్ పాదయాత్రలో రాధా ఇమేజ్‌ను వాడుకున్న చంద్రబాబు.. తాజాగా సీట్ల కేటాయింపు విషయానికి వచ్చేసరికి రాధాకు హ్యాండిచ్చారు. 
 
ఇక చంద్రబాబు వ్యవహారశైలి పట్ల రాధా వర్గం రగిలిపోతుంది. కనీసం విజయవాడ తూర్పులో అయినా తమకు అవకాశం ఇస్తారని భావిస్తే అకకడ కూడా వారికి నిరాశే ఎదురైంది. దీంతో రాధాకు టీడీపీపో శాశ్వతంగా తలుపులు మూసివేసినట్టే అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. విజయవాడలో మంచి పట్టున్న వంగవీటి రంగా కుటుంబాన్ని చంద్రబాబు తన అవసరాల మేరకు వాడుకుని, ఆ తర్వాత కూరలో కరివేపాకులా తీసిపడేశారని ఆయన అనుచరులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు