నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను సినిమాగా తీయాలని బాలకృష్ణ అనుకోవడం.. ఇటీవల ఈ సినిమా ప్రారంభోత్సవం చేయడం తెలిసిందే. తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్టు ఎనౌన్స్ చేసారు. అయితే.. ఊహించనివిధంగా తేజ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఈ సినిమాని ఎవరు డైరెక్ట్ చేయనున్నారు అనే దానిపై రోజుకో వార్త బయటకు వస్తోంది. ఇదిలా ఉంటే... టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో సినీ బయోపిక్‌ల ప్రస్తావన వచ్చిందట.
మహానటి బయోపిక్ బాగుందనే అంశం తన దృష్టికి వచ్చిందని చంద్రబాబు చెప్పారట. మీ ఫీడ్‌బ్యాక్ ఏంటంటూ సభ్యులను బాబు ప్రశ్నించారని సమాచారం. మహానటి బయోపిక్ బాగుందని.. సందేశాత్మకంగా ఉందని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చెప్పారట. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ గురించి ప్రస్తావనకు రాగా... స్క్రిప్ట్ తాను విన్నానని.... ఎన్టీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేవరకు మొదటి భాగం ఉంటుందని అసలు విషయాన్ని బయటపెట్టారట మురళీ మోహన్.