విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబు

మంగళవారం, 25 జూన్ 2019 (14:30 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలసి యూరప్‌కు విదేశీ పర్యటనకు వెళ్లారు. ఈ నెల 19వ తేదీన ఆయన యూరప్‌కు వెళ్లారు. ఈ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రజా వేదికను కూల్చివేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని సర్కారు నిర్ణయించింది. దీన్ని టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తు్నరు. 
 
అలాగే, టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులైన సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్‌లతో పాటు.. మాజీ ఎంపీ అంబికా కృష్ణ కూడా బీజేపీలో చేరిపోయారు. అలాగే, తెలంగాణకు చెందిన టీడీపీ నేతలు పెద్దిరెడ్డి, బోడె జనార్థన్ కూడా కమలం పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడంతో చంద్రబాబు ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి అటు టీడీపీతో పాటు ఇటు రాజకీయ వర్గాల్లో కూడా నెలకొంది. 
 
పార్టీ జంపింగ్‌ల సంగతి పక్కన పెడితే.. ప్రజావేదిక కూల్చివేయాలంటూ సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాలపై చంద్రబాబు ఎలా స్పందిస్తారనే అంశం అత్యంత ఉత్కంఠగా మారింది. ఇదే ప్రజావేదికను తమకు కేటాయించాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాసిన సంగతి కూడా తెలిసిందే. అయితే.. ఈ నిర్మాణమే అక్రమమంటూ కూల్చివేయాలని వైసీపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు