ఏపీ ప్రజలు గాజులు తొడుక్కుని కూర్చోలేదు : చంద్రబాబు

శుక్రవారం, 19 జనవరి 2018 (14:42 IST)
తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌తో పోల్చవద్దంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఏపీ ప్రజలు చేతగానివాళ్లేం కాదని, గాజులు తొడుక్కుని కూర్చోలేదంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో గురువారం జరిగిన ‘ఇండియా టుడే కాంక్లేవ్‌’లో సదస్సులో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. 
 
శుక్రవారం రెండో రోజు సదస్సు ప్రారంభంకాగా, పలువురు ఉన్నతాధికారులు కేసీఆర్ మాటలపై అభ్యంతరం వెల్లడించారు. ఆపై మరోసారి మాట్లాడిన చంద్రబాబు, ఏపీ ప్రజలు చేతగాని వాళ్లేం కాదని అన్నారు. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని ప్రజల అభిప్రాయాన్ని మాట మాత్రమైనా అడగకుండానే రాష్ట్రాన్ని విడదీశారని ఆరోపించారు. 
 
ప్రజల ప్రమేయం లేకుండానే విభజన జరిగిపోయిందన్నారు. అన్ని వర్గాలతో మాట్లాడి ముందడుగు వేయాలని, రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని తాను అడుగుతుంటే, కేంద్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయం జరిగిందని అంగీకరిస్తున్న వారు, న్యాయం చేసేందుకు ఆలస్యం ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు