ఈ సమావేశంలో వైవీబీ, జోగి మధ్య పలుమార్లు వాగ్వాదం చోటు చేసుకుంది. జోగి రమేష్ మాట్లాతున్న సమయంలో వైవీబీ లేచి రుణమాఫీని రద్దు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.99ను జారీ చేసిందని, దీంతో జిల్లాలో వెయ్యి కోట్లను రైతులు నష్ట పోయారని అన్నారు.
మరో సందర్భంలో వైవీబీ మాట్లాడుతూ....‘పంచాయతీ భవనాలకు వైసీపీ రంగులు వేస్తున్నారు... ఈ అధికారం మీకు ఎవరిచ్చారు... ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన నగదుతో పంచాయతీ భవనాలకు, కమ్యూనిటీ హాళ్లకు పార్టీ రంగులు వేస్తారా’ అని ప్రశ్నించారు.