అప్పుడు సీబీఐ కావాలని డిమాండ్ చేసిన జగన్.. ఇప్పుడు వద్దు అంటున్నారన్నారు. బాబాయ్‌ని చంపిన వారితో కలిసిన వ్యక్తి జగన్ అని ఆరోపించారు. నాడు వివేకా కూతురు... నేడు షర్మిల పోరాడుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇకపోతే, పంచాయతీ ఎన్నికల తొలి దశ ఫలితాలపై కూడా ఆయన స్పందించారు.
క్షేత్ర స్థాయిలో ఇంకా టీడీపీ ఎంతో బలంగా ఉందనే విషయాన్ని ఈ ఫలితాలు రుజువు చేస్తున్నాయన్నారు. ముఖ్యంగా, టీడీపీ మద్దతు తెలిపిన అభ్యర్థులు 1023 పంచాయతీల్లో విజయం సాధించారని, వారి ఓట్ల శాతం 38 శాతంగా ఉందని బాబు గుర్తుచేశారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపాను ఓడించడం టీడీపీ శ్రీకారం చుట్టిందన్నారు.