చంద్రబాబు జోలికెళ్లిన వారికి పుట్టగతులుండవ్... నిర్మాత అశ్వనీదత్

బుధవారం, 13 సెప్టెంబరు 2023 (14:31 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జోలికి వెళ్లిన వారికి ఇక పుట్టగతులు ఉండవని ప్రముఖ సినీ నిర్మాత సి.అశ్వనీదత్ శాపనార్థాలు పెట్టారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. ఆయన్ను అత్యంత దుర్మార్గంగా అరెస్టు చేసిన ప్రభుత్వం.. రాష్ట్రంలో బీభత్సం సృష్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో శిక్షను అనుభవిస్తారన్నారు. 
 
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థలో అవినీతి జరిగినట్టుగా కట్టుకథ అల్లించి.. ఆ కేసులో చంద్రబాబును అరెస్టు చేయిడం దారుణమన్నారు. అదొక దురదృష్టకమైన రోజని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశానికి ఒక గొప్ప ప్రధానమంత్రిని, ఒక గొప్ప లోక్‌సభ స్పీకర్, ఒక గొప్ప రాష్ట్రపతిని ఇచ్చిన ది గ్రేట్ లెజండరీ చంద్రబాబును ఇంత దుర్మార్గంగా అరెస్టు చేసి లోనిపోని బీభత్సం చేసిన వారికి ఖచ్చితంగా పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. 
 
దీనికి పరిష్కారం కూడా ఎన్నో రోజుల్లో లేదని, మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు రాగానే వాళ్లు శిక్షను అనుభవిస్తారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఖచ్చితంగా 175 సీట్లకు గాను 160 సీట్లలో గెలిచ తీరుతారని ధీమా వ్యక్తం చేశారు. 
 
మరోవైపు, సినీ నిర్మాత నట్టి కుమార్ కూడా మంగళవారం చంద్రబాబు మద్దతుగా మాట్లాడిన విషయం తెల్సిందే. చంద్రబాబు చిత్రపరిశ్రమ శ్రేయోభిలాషి అని అలాంటి వ్యక్తిని అరెస్టు చేస్తే చిత్ర పరిశ్రమ పెద్దలు ఎవరూ స్పందించకపోవడం దారుణమని నట్టి కుమార్ ఘాటుగా కామెంట్స్ చేశారు. తాను టీడీపీకి వ్యతిరేకనని, చంద్రబాబుకు అనుకూలమని నట్టికుమార్ స్పష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు