మందుబాబులకు గుడ్ న్యూస్: రాత్రి 10 గంటల వరకు అమ్మకాలు

మంగళవారం, 18 జనవరి 2022 (10:08 IST)
మందుబాబులకు గుడ్ న్యూస్. ఏపీలో మరో గంటపాటు అదనంగా మద్యం అమ్మకాలకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది. తద్వారా ఇకపై రిటైల్ షాపుల్లో రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వడం జరిగింది. 
 
గతంలో రిటైల్ షాపుల్లో రాత్రి 9 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు మరో గంటపాటు అదనంగా సమయాన్ని పొడిగించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. విక్రయ ఖాతాల నిర్వహణకు మరో గంట సమయం పెంచినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
 
మద్యం విషయంలో ఏపీ ఎక్సైజ్ శాఖ ఈ మధ్యకాలంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల  రాష్ట్రంలో మద్యంపై పన్ను రేట్లలో మార్పులు చేసింది సర్కార్. వ్యాట్‌తో పాటు స్పెషల్‌ మార్జిన్‌, అడిషనల్‌ ఎక్సైజ్‌ డ్యూటీని క్రమబద్ధీకరించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు