చెంచుగూడెంలో మూడేళ్ల చిన్నారిని ఈడ్చెకెళ్లిన చిరుత!!

ఠాగూర్

గురువారం, 14 ఆగస్టు 2025 (17:38 IST)
ఏపీలోని ప్రకాశం జిల్లాలో దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచుగూడెంలో ఓ విషాదకర ఘటన జరిగింది. తల్లిదండ్రులతో కలిసివున్న మూడేళ్ల చిన్నారిపై ఓ చిరుత పులి దాడి చేసింది. ఆ తర్వాత ఆ చిన్నారిని ఈడ్చుకెళ్లింది. ఈ దారుణం శ్రీశైలంకు 12 కిలోమీటర్ల దూరంలో జరిగింది. 
 
దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచు గూడెంలో బుధవారం అర్ధరాత్రి నిద్రిస్తున్న కుడుముల అంజయ్య, లింగేశ్వరి దంపతులకు చెందిన చిన్నారి(3)పై చిరుతపులి దాడి చేసింది. సమీప అడవి నుంచి వచ్చిన చిరుతపులి తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిని ఈడ్చుకెళ్లింది. అక్కడే ఉన్న తండ్రి కేకలు వేసి చిరుతను వెంబడించడంతో.. గ్రామ శివారులో చిన్నారిని వదిలేసి వెళ్లింది. చిరుతపులి దాడిలో గాయపడిన చిన్నారిని సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
 
సుమారు 70 ఏళ్లకు పైగా చిన్నారుట్లగూడెంలో నివసిస్తున్నప్పటికి ఐటీడీఏ అధికారులు విద్యుత్ సౌకర్యం కల్పించడం లేదని చెంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దోర్నాల - శ్రీశైలం రహదారిపై వెళుతున్న ఆర్టీసీ బస్సులు, వాహనాలను నిలిపివేసి గంటపాటు నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న దోర్నాల అటవీ, పోలీసుశాఖ అధికారులు వచ్చి చెంచులతో చర్చించి ఆందోళనను విరమింపజేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు