హైదరాబాదులో నిత్యం రద్దీగా వుండే షాపింగ్ మాల్స్ బోసిపోయాయి. కరోనా ఎఫెక్ట్‌తో హోటల్స్, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ నిర్మానుష్యంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా చికెన్ అమ్మకాలు తగ్గినా.. హైదరాబాద్‌లో కరోనా వైరస్ డిటెక్ట్ అయ్యే వరకు చికెన్ బిర్యానీ అమ్మకాలు జోరుగానే సాగాయి. రెండు రోజులుగా బిజినెస్ 50 శాతం తగ్గిందని హోటల్ నిర్వాహకులు చెప్తున్నారు. ఫుడ్ ఆర్డర్లపైనా ఈ ఎఫెక్ట్ ఉందన్నారు.
కరోనా వైరస్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్ఎంసీ, స్కూల్ ఎడ్యుకేషన్, హోం శాఖ, ఐ అండ్ పీఆర్, టూరిజం, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని బస్ స్టాప్‌లు, రైల్వే.. మెట్రో స్టేషన్లు, పబ్లిక్ ప్లేసుల్లో హోర్డింగులపై కరోనా నివారణపై ప్రచారం చేయాలని, ఈ పనులన్నీ శుక్రవారం రాత్రిలోగా పూర్తి చేయాలని సూచించింది.