ఏపీలో రాజధాని చిచ్చు.. ఈ పిచ్చికుక్కలు అపుడేం చెప్పాయి : చింతకాయల ఫైర్

బుధవారం, 14 సెప్టెంబరు 2022 (15:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోమారు రాజధాని చిచ్చు చెలరేగింది. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన అమరావతి ప్రాంత రైతులు అమరావతి నుంచి అరసవిల్లి వరకు మహా పాదయాత్రను ప్రారంభించారు. ఈ యాత్రపై అధికార నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారు. వీటికి టీడీపీ నేతలు గట్టిగానే కౌంటరిస్తున్నారు. బుధవారం విశాఖలో టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు విలేకరులతో మాట్లాడుతూ వైకాపా నేతలను ఏకిపారేశారు. ఇపుడు అరుస్తున్న కుక్కలు అపుడేమయ్యారు అంటూ నిలదీశారు. అధికారంలోకి రాక ముందు ఒక మాట.. వచ్చిన తర్వాత మరోమాట మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. 
 
ఇపుడు మంత్రిగా ఉన్న బొత్స సత్తిబాబు అపుడేం చెప్పారు. మేం కూడా ఇక్కే రాజధానిని నిర్మిస్తాం అని చెప్పలేదా. దానికి సంబంధించిన వీడియో మీడియా వద్దనే ఉంది. అలాగే, మహా పాదయాత్రపై గోల చేస్తూ పిచ్చిపిచ్చిగా అరుస్తున్న ఈ పిచ్చికుక్కలు గత ఎన్నికల సమయంలో ఏం మాట్లాడారు అంటూ ప్రశ్నించారు. 
 
డైమండ్ రాణి ప్రస్తుత మంత్రి రోజా ఏం చెప్పింది. నమ్మండయ్యా బాబూ.. మేం ఇక్కడే రాజధాని కడుతున్నాం. అందుకే మా బాసు ఇక్కడే ప్యాలెస్ కట్టుకున్నాడు అని రోజా చెప్పాలేదా? అని ప్రశ్నించాడు. 
 
మాట చెప్పడం మడమ తిప్పండం ఎందుకు జగన్ రెడ్డీ? అధికారంలోకి వచ్చాక బొత్స సత్తిబాబు రాజధానిని చూసి ఇదొక ఎడారి అంటాడు. ఇంకొక పనికిమాలిన మంత్రి ఇదొక శ్మశానం అంటాడు. ఎన్నికలకు ముందు ఒక మాట.. ఎన్నికలు అయ్యాక ఒక మాట. ప్రజను మోసం చేసి, మాయ చేసి, ముద్దులు పెట్టి లద్ధిపొందడమే అంతిమ లక్ష్యం. 
 
మరో మంత్రి ఎవడో ఒకడు పెద్ద మూర్ఖుడిలా ఉన్నాడు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కొత్తగా చట్టం తెస్తాడట. ఎలా చేస్తావయ్యా నువ్వు.. నీకస్సలు చట్టాలు చేయడం తెలుసా? గాలికి వచ్చినవాళ్లు మీరు.. చట్టాలపై మీకేం అవగాహన వుంది?
 
అమరావతిలోనే రాజధానిని కట్టాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ వంటి వారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేశారు. కానీ ఇవాళ ప్రజలను అయోమయానికి గురిచేసేందుకు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ మండిపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు