పవన్ కళ్యాణ్ చెంతకు చేరిన వైకాపా నేత శివరామిరెడ్డి

మంగళవారం, 16 ఆగస్టు 2022 (17:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఏపీ రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. ఇప్పటినుంచే అన్ని రాజకీయ పార్టీల నేతలు ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. అదేసమయంలో వచ్చే ఎన్నికల్లో తమకు టిక్కెట్ లభించదని గట్టిగా భావించిన వారు ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు సిద్ధమైపోతున్నారు. అలాంటి వారిలో వైకాపా నేతలే అధికంగా ఉన్నారు. వీరి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. 
 
ఈ క్రమంలో గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపరకు చెందిన వైకాపా నేత ఉయ్యూరు శివరామిరెడ్డి పవన్ సొంత పార్టీకి రాంరాం పలికారు. ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శివరామిరెడ్డి మాట్లాడుతూ, జనసేన పార్టీలో చేరడం తనకు ఎంతో ఇష్టంగా ఉందని తెలిపారు. 
 
కాగా, ఉయ్యూరు శివరామిరెడ్డి 1987లో తెలుగుదేశం పార్టీలో చేరి మూడేళ్ళపాటు మండల అధ్యక్షుడిగా ఉన్నారు. సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ప్రారంభించడంతో ఆయన వంచన చేరి గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడయ్యారు. 
 
2012లో వైసీపీలో చేరారు. జగన్‌ ఆధ్వర్యంలోని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు విసుగు చెంది పవన్‌ కల్యాణ్‌ వెంట నడిచేందుకు నిర్ణయించుకున్నట్లు శివరామిరెడ్డి చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు