కానిస్టేబుల్‌లో మహిళా ఎస్ఐ సన్నిహితం... ఇద్దరూ సూసైడ్ అటెంప్ట్.. ఎక్కడ?

ఆదివారం, 9 మే 2021 (10:09 IST)
ఆమె ఓ పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇదే స్టేషనులో తన కింద పని చేసే ఓ కానిస్టేబుల్‌లో పరిచయం ఏర్పడింది. అదికాస్త సాన్నిహిత్యంగా మారింది. చివరకు వారిద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లా చుండూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలన పరిశీలిస్తే, చుండూరు పోలీస్ స్టేషన్‌లో శ్రావణి గతేడాది అక్టోబరులో చుండూరు ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు. రవీంద్ర గత ఐదేళ్లుగా అదే స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరూ శనివారం ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. శ్రావణితో రవీంద్ర సన్నిహితంగా మెలిగేవాడని చెబుతున్నారు. వారి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదని సీఐ రమేశ్‌బాబు తెలిపారు.
 
శనివారం వారు స్టేషన్‌కు కూడా రాలేదని, ఆత్మహత్యాయత్నం తర్వాత వారిద్దరూ స్వయంగా కారులో వెళ్లి తెనాలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత వారిని మరింత మెరుగైన చికిత్స కోసం గుంటూరులోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించినట్టు తెలిపారు. వారిద్దరూ అపస్మారక స్థితిలో ఉన్నారని, స్పృహలోకి వచ్చిన తర్వాత వివరాలు సేకరిస్తామని సీఐ వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు