అర్థరాత్రి వరకు కలెక్టరేట్‌లోనే... బస్సులోనే బస!!

ఠాగూర్

మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (09:30 IST)
భారీ వర్షాల కారణంగా నీట మునిగిన విజయవాడ నగర వాసులను రక్షించేందుకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేయింబవుళ్లు శ్రమిస్తున్నారు. ఇందులోభాగంగా ఆయన విజయవడా వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పైగా, ఆయనే స్వయంగా రంగంలోకి దిగి బాధితులను పరామర్శించడం, వారి సమస్యలను అడిగి తెలుసుకుని కావాల్సిన సాయం అందించడం చేస్తున్నారు. 
 
దీనిలోభాగంగా ముఖ్యమంత్రి సోమవారం రాత్రి 2 గంటల వరకు విజయవాడ కలెక్టరేట్‌‍లోనే ఉన్నారు. మూడో రోజు సహాయక చర్యలు, వరద నిర్వహణను పర్యవేక్షించిన ఆయన... కలెక్టరేట్ వద్ద బస్సులోనే బస చేయడం గమనార్హం. రెండు గంటల తర్వాత విశ్రాంతి తీసుకునేందుకు ఆయన వెళ్లారు. అటు ఆయన తనయుడు, రాష్ట్ర విద్యామంత్రి నారా లోకేశ్ సైతం అర్థరాత్రి దాటేవరకు కలెక్టరేట్‌లోనే ఉండి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. కాగా, బుధవారం కూడా విజయవాడకు అదనపు బలగాలు, సహాయక బృందాలు రానున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు