పీకల్లోతు నీళ్లుంటే ఎవరైనా ఎలా సాయం చేస్తారు? : జగన్‌ను ప్రశ్నించి యువతి.. వీడియో వైరల్

ఠాగూర్

సోమవారం, 2 సెప్టెంబరు 2024 (22:35 IST)
కుండపోత వర్షంతో పాటు కృష్ణానది ఉప్పొంగడంతో విజయవాడ నగరం నీట మునిగింది. అనేక ప్రాంతాల్లో పీకల్లోతు నీరు నిలిచివుంది. మరికొన్ని ప్రాంతాల్లో ఏకంగా విద్యుత్ స్తంభాలో నీట మునిగిపోయారు. అలాంటి ప్రాంతాల్లో కూడా ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ప్రణాలను ఫణంగా పెట్టి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వరద సహాయక చర్యల్లో రేయింబవుళ్లు చేయిస్తూ, తాను నిద్రపోకుండా, అధికారులకు సైతం నిద్రలేని రాత్రులను మిగిలిస్తున్నారు. 
 
ఈ క్రమంలో సోమవారం వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం సింగ్ నగర్‌‍తో పాటు మరికొన్ని వరద బాధిత ప్రాంతాల పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం నుంచి సాయం వరద బాధితులకు సాయం అందలేని ధ్వజమెత్తారు. అయితే, బాధితులతో జగన్ మాట్లాడుతున్న సమయంలో ఓ యువతి నిర్మొహమాటంగా ఏమాత్రం తొణకకుండా భయపడకుండా సమాధానం చెప్పిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
మీకు ప్రభుత్వం సాయం అందిందా, ఇంకా అందలేదా అని ఓ మహిళను జగన్‌ ప్రశ్నించారు. ఆ సమయంలో పక్కనే ఉన్న మరో యువతి స్పందిస్తూ, నీళ్లు మెడ వరకు ఉన్నాయి. పాపం వాళ్లయినా ఎలా ఇస్తారు. అప్పటికీ కొంతమందికి వరద సాయం పంపిణీ చేశారు అని సమాధానం చెప్పారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

 

ప్రభుత్వ సహాయం పై బురద చల్లటానికి వెళ్ళిన ఫేక్ ఫెలో. మీకు ఏమి సహాయం రాలేదు కదా అని ప్రశ్నించిన ఫేకు జగన్. సైకో బ్యాచ్ మొత్తానికి షాక్ ఇచ్చిన మహిళ.

ఇంత వరదలో ఎవరైనా ఏమి చేస్తారు ? అయినా ప్రభుత్వం చొరవతో మాకు చాలా మందికి ఆహారం అందింది అంటూ, జగన్ మొఖం మీదే చెప్పిన మహిళ. ప్లాన్… pic.twitter.com/rguQjaqHRX

— Telugu Desam Party (@JaiTDP) September 2, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు