Pawan Kalyan_Chandra Babu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుండి దేశ రాజధానికి బయలుదేరుతారు. అలాగే గురువారం ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు హాజరవుతారు. ఈ ఢిల్లీ పర్యటన కారణంగా, చంద్రబాబు నేతృత్వంలో జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది.