ప్రజల ఆకాంక్షను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం : గవర్నర్ అబ్దుల్ నజీర్

ఠాగూర్

ఆదివారం, 26 జనవరి 2025 (13:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆదివారం విజయవాడలోని ఇందిరాగాధీ మున్సిపల్ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు జరిగాయి. ఇందులో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందన స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా గవర్నర్ నజీర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారన్నారు. ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. గత ప్రభుత్వం భారీ అప్పులు చేసి సమస్యలు సృష్టించిందన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలా ఈ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. స్వర్ణాంధ్ర విజన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. ప్రజలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం కలగాలనేదే తమ నినాదమన్నారు. ప్రభుత్వ పది సూత్రాల అమలు ద్వారా అనుకున్న లక్ష్యాలు సాధిస్తామని ఆయన వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు