సీఎం చంద్రబాబు రైల్వే ట్రాక్‌పై ఉండ‌గానే దూసుకొచ్చిన ట్రైన్... తప్పిన ప్రమాదం (Video)

ఠాగూర్

గురువారం, 5 సెప్టెంబరు 2024 (19:58 IST)
విజయవాడ పరిధిలోని మధురానగర్‌లో వరద ముంపు ప్రాంతాల్లో గురువారం కూడా ముమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఆ సమయంలో ఆయనకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. వరదను పరిశీలించేందుకు రైలు వంతెనపైకి సీఎం వెళ్లారు. వంతెనపై నడిచి బుడమేరు ఉధృతిని చంద్రబాబు పరిశీలించారు. రైలు వంతెనపై ఆయన నడుస్తుండగానే రైలు ఎదురుగా రావడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. 
 
వెంటనే సీఎం దృష్టికి రైలు వస్తున్న విషయం చెప్పారు. ఆ వెంటనే ఆయన పక్కకు తప్పుకున్నారు. అయితే, రైలు మాత్రం చంద్రబాబుకు అతి సమీపంగా రైలు వెళ్లింది. రైలు తగలకుండా సీఎం ఓ పక్కకు నిలబడి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. రైలు వెళ్లిపోయాక అధికారులు, భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

సీఎం రైల్వే ట్రాక్ పై ఉండ‌గానే వ‌చ్చిన ట్రైన్...

సెక్యూరిటీ అప్ర‌మ‌త్తం కావ‌టంతో త‌ప్పిన పెను ప్ర‌మాదం#Chandrababu https://t.co/Lvbo9NIZvV pic.twitter.com/GrDFtyiILI

— Telugu360 (@Telugu360) September 5, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు