టీటీడిలో గతంలో జరిగిన మోసాలపై సీఎం చంద్రబాబు విచారణ జరిపించాలి

ఐవీఆర్

గురువారం, 13 జూన్ 2024 (23:14 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం మోసాలకు నెలవుగావ మారిపోయిందని సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆరోపించారు. తిరుమలలో జరుగుతున్న అన్యాయాలను నిలదీసే హక్కు భ్తకులకు లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలు ఆర్టీఐ పరిధిలో ఉంటే ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం లేదన్నారు. ఆర్టీఐ పరిధిలోకి తిరుమల తిరుపతి దేవస్థానం రాకుండా కేసులు వేశారంటూ మండిపడ్డారు. టీటీడీలో కొన్ని సంవత్సరాలుగా భక్తులను నిలువుదోపిడికి గురిచేస్తున్నారన్నారు. ఆర్జిత సేవ టిక్కెట్లు బ్లాక్ మార్కెట్లో విచ్చలవిడిగా లభ్యమవుతున్నాయన్నారు. చెన్నై, ముంబై, బెంగళూరు నగరాలకు చెందిన కొందరు దళారులు ఆర్జిత సేవా టిక్కెట్లలో కుంభకోణాలకు పాల్పడుతున్నారని తెలిపారు. 
 
సీఎం చంద్రబాబునాయుడు గారు గతంలో జరిగిన పాలకమండలికి ఈ-కోటా విధానంలో జరిగిన మోసాలపై, అదేవిధంగా కొండపై జరిగిన ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ మోసలపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. గతంలో ఈ- కోట విధానం వల్ల దళారుల వ్యవస్థ ఎక్కువగా ఉండేదని, ఈ ఆర్జిత సేవ కుంభకోణలను వెలికి తియ్యాల్సిన విజిలెన్స్ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించారని ప్రభుత్వ మెప్పుకోసం అప్పుడప్పుడు ఎప్పుడో పట్టుకున్న వారిని పట్టుకుని జిమ్మిక్‌లు ఆడుతున్నారని అన్నారు. 
 
తిరుమల పవిత్రతను కాపాడాల్సిన విజిలెన్స్ అధికారులు అక్రమార్కులకు కొమ్ముకాశారని మండిపడ్డారు. విజిలెన్స్ అధికారులు కొండపై చిరు వ్యాపారులకు అక్రమ వడ్డీకి డబ్బులు ఇస్తూ వారి అక్రమాలకు కొమ్ముకాస్తున్నారన్నారు. టీటీడీ ఎన్నో కుంభకోణలు, మోసాలు, నిలువుదోపిడీలకు అడ్డాగా మారిపోయిందన్నారు. తిరుమలలో మద్యం, సిగరెట్లు, గంజాయి లాంటి మత్తు పదార్థాలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయని అన్నారు. 
 
తిరుపతిలో మద్యపాన నిషేధం, మాంసాహార నిషేధం చేస్తే సీఎం చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారన్నారు. కొండమీద పేరుకు మాత్రమే దర్శనాలు కొన్ని ఆన్ లైన్ అని మిగిలినది అంతా క్యాష్ లైన్ అన్నారు. తిరుమలలోని అక్రమాలపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని లేకపోతే రిటైర్డ్ న్యాయమూర్తితో అయినా విచారణ చేపట్టాలని, సీఎం చంద్రబాబు ప్రాణాలు కాపాడిన వెంకన్న పేరుతో జరిగిన మోసాలకు అడ్డుకట్టవేసి తిరుపతి వాసిగా రుణం తీర్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కేతిరెడ్డి కోరారు. వెంకన్న పేరుతో దోపిడీలు చేస్తున్నదళారి వ్యవస్థను రూపుమాపి వెంకన్నరుణం తీర్చుకోవాలని కోరారు. అధికారులు వెంకన్న భక్తులకు ఆధ్యాత్మిక భావంను పెంపొందిచేందుకు కృషి చెయ్యాలని ముఖ్యమంత్రిని కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు