తేజస్విని కుటుంబానికి సీయం జగన్ 10 లక్షల ఎక్స్‌గ్రేషియా

మంగళవారం, 20 అక్టోబరు 2020 (21:28 IST)
అమరావతి: ఇటీవల హత్యకు గురైన దివ్య తేజస్విని కుటుంబానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
 
తేజస్విని తల్లిదండ్రులు, వి.జోసెఫ్, కుసుమా మంగళవారం ఇక్కడి సీఎం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. దిశా చట్టం ప్రకారం నేరస్థుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. ఈ కష్ట సమయాల్లో ప్రభుత్వం కుటుంబానికి అండగా నిలుస్తుందని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు