వలంటీర్ అంటేనే సేవ చేయడం.. సీఎం జగన్మోహన్ రెడ్డి

గురువారం, 11 ఫిబ్రవరి 2021 (13:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఇంటి వద్దకే చేరవేసేందుకు గ్రామ వలంటీర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. కానీ, వలంటీర్లు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా, అధికార పార్టీ నేతల ఒత్తిడిని తట్టుకోలేక పోతున్నారు. 
 
ఈ క్రమంలో వలంటీర్ల వ్యవస్థపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. వలంటీర్ అంటేనే స్వచ్ఛందంగా పనిచేసేవారని అర్థమన్నారు. కానీ, దానిని మార్చేసి ఇంకా ఆశించడం అంటే మొత్తం వ్యవస్థనే నీరుగార్చినట్టు అవుతుందన్నారు. 
 
వలంటీర్లను ప్రోత్సహించేందుకు ఉగాది రోజున సత్కరించాలని భావిస్తున్నట్టు తెలిపారు. తనకు ఈ ఆలోచన వచ్చిందని వెల్లడించారు. ఉగాది రోజున అన్ని నియోజకవర్గాల్లోనూ వలంటీర్లకు సత్కారం చేయాలని ప్రభుత్వ కార్యదర్శులను సీఎం జగన్‌ ఆదేశించారు. 
 
వారికి సేవారత్న, సేవామిత్ర బిరుదులను ఇవ్వాలన్నారు. ఇలా చేయడంవల్ల వలంటీర్ల సేవలను గుర్తించినట్లు, ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు. కాగా, మరో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా వలంటీర్లకు కూడా ఇదే హితబోధ చేశారు. తప్పుడు మాటలు విని చెడిపోవద్దంటూ వలంటీర్లకు విజ్ఞప్తి చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు