అసెంబ్లీ ఎన్నికలపై స్పీడ్ పెంచిన సీఎం జగన్మోహన్ రెడ్డి

శుక్రవారం, 29 డిశెంబరు 2023 (18:20 IST)
అసెంబ్లీ ఎన్నికలపై సీఎం జగన్ స్పీడ్ పెంచారు. 2024 ఎన్నికల బృందాన్ని ఇప్పుడే సిద్ధం చేశారు. సుదీర్ఘ కసరత్తు అనంతరం తుది జాబితా సిద్ధమైంది. ఏకంగా 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలనే ఆలోచనలో ఉన్న జగన్.. 60 నుంచి 65 స్థానాల్లో మార్పులు చేశారు. దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇప్పుడు అభ్యర్థులంతా కొత్త సంవత్సరం నుంచి ప్రజల్లోకి వెళ్లనున్నారని తెలుస్తోంది.
 
గతంలో ఏ రాజకీయ పార్టీ తీసుకోని నిర్ణయం సీఎం జగన్ తీసుకున్నారన్నారు. అభ్యర్థుల మార్పుపై కసరత్తు పూర్తయింది. ఏకంగా 60 నుంచి 70 స్థానాలు మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సుదీర్ఘంగా కృషి చేసిన సీఎం జగన్ జాబితా సిద్ధం చేశారు. కొంత మంది ఎంపీలను ఎమ్మెల్యేలుగా, మరికొంత మంది ఎమ్మెల్యేలను ఎంపీలుగా జగన్ రంగంలోకి దించనున్నారు.
 
ఇలా మారిన వారిని, టికెట్లు రాని వారందరినీ తాడేపల్లికి పిలిపించి జగన్ నేరుగా మాట్లాడారు. పరిస్థితిని వారికి వివరించారు. ఎందుకు మార్పు? టికెట్ ఎందుకు ఇవ్వలేదు? దీనిపై జగన్ క్లారిటీ ఇచ్చారు. మార్పులు, చేర్పుల అనంతరం ఎట్టకేలకు జగన్ తుది జాబితాను సిద్ధం చేశారు. 
 
అభ్యర్థుల మార్పు విషయంలో జగన్ అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ప్రజా వ్యతిరేకత, ఎమ్మెల్యేల వ్యవహార శైలి, సామాజిక సమీకరణాలు.. ఇవన్నీ జగన్ దృష్టిలో పెట్టుకున్నాయి. 
 
సామాజిక సమీకరణాలు ఎక్కువగా ప్రభావం చూపాయనే చెప్పాలి. ఈసారి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జగన్ పెద్ద దెబ్బే వేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఏ సామాజికవర్గ నేత బలంగా ఉంటే వారికే జగన్ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు