రాష్ట్రంలో నూతన విద్యా విధానంపై సీఎం జగన్ రివ్యూ నిర్వహించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాముఖ్యతను ఇస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం నూతన విద్యావిధానం తీసుకొనిరాగా దానిపై సీఎం జగన్ మంగళ వారం సమీక్షించారు.
నూతన విద్యావిధానంలో ప్రభుత్వం అమలు పరుస్తున్న చాలా అంశాలు ఉన్నాయని తెలిపారు. ప్రీ ప్రైమరీ క్లాసులు నిర్వహించాలని ముందుగానే నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రీ ప్రైమరీ విద్యకు, అంగన్‌వాడీ విద్యకు, స్కూల్ విద్యకు మధ్యలో ఒక ఏడాది అనుసంధానం చేయాలని నిర్ణయించామని మంత్రి అన్నారు.
పీపీ1, పీపీ2తో పాటు మరో ఏడాది పెంచుతున్నామని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఉన్నత పాఠశాల స్థాయిలో 3,5,8 తరగతుల్లో పరీక్షలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులు సామర్థ్యాన్ని పరీక్షించడానికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే 10వ తరగతి బోర్డు పరీక్షలో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు.