తమిళనాడు, కర్ణాటక నుంచి ఆక్సిజన్ దిగుమతి చేసుకుంటున్నాం. ఈనెల 10న చెన్నై, కర్ణాటక నుంచి రావాల్సిన ఆక్సిజన్ ఆలస్యమైంది. ఆక్సిజన్ రావడం ఆలస్యమవ్వడంతో తిరుపతిలో 11 మంది చనిపోయారు. ప్రస్తుతం కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుంటున్న 20 ఎంటి ఆక్సిజన్‌ను 150 ఎంటికి పెంచాలని విన్నవించారు.
పెద్దమొత్తంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలంటే టెక్నాలజీ బదిలీ తప్పనిసరనీ, దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సంస్థ కోవాగ్జిన్ ఒక్కటేనని తెలిపారు. వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించి ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలు సహకరించాయని తెలిపారు.