ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఒకటి వైఎస్ఆర్ కాపునేస్తం ఒకటి. ఈ పథకం కింద మూడో విడత ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి శుక్రవారం విడుదల చేయనున్నారు. కాకినాడి జిల్లా గొల్లప్రోలులో ఆయన బటన్ నొక్కి నిధులను బట్వాడా చేస్తారు. ఆ తర్వాత అక్కడ జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. ఇందుకోసం ఆయన శుక్రవారం ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి ఉదయం 10.30 గంటలకు గొల్లప్రోలు చేరుకుంటారు.
అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ వేదికపై నుంచి వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం మూడో విడత నిధులను విడుదల చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందన అర్హులైన పేద మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.15 వేల చొప్పున ఆయన ఆర్థిక సాయం చేస్తారు. మొత్తం 3,38,792 మందికి రూ.508.18 కోట్లను లబ్దిదారుల ఖాతాల్లో ఆయన జమ చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.40 గంటలకు గొల్లప్రోలు నుంచి తిరిగి ప్రయాణమై తాడేపల్లికి చేరుకుంటారు.