విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం: సీఎం జగన్

బుధవారం, 20 అక్టోబరు 2021 (23:17 IST)
అబద్దాలు ఆడతారు, అసత్యాలు ప్రచారాలు చేస్తారు. వంచన కనిపిస్తుంది. ప్రతి మాటలోనూ, ప్రతి రాతలోనూ అబద్దాలతో మోసం చేసే వక్రబుద్ధే కనిపిస్తుంది. మత విద్వేషాలను కూడా రెచ్చగొచ్చడానికి ఏ మాత్రం కూడా వెనుకాడరు. కులాల మధ్య, మతాల మధ్య కూడా చిచ్చు పెడతారు. ఇష్టమొచ్చినట్లు కార్యక్రమాలు చేస్తారు అని సీఎం జగన్ అన్నారు.


ఇంకా ఆయన మాట్లాడుతూ... వ్యవస్ధలను పూర్తిగా మేనేజ్‌ చేయబడుతున్న పరిస్థితులు మన కళ్లముందే కనిపిస్తున్నాయి. ఏ పేదవాడికి మంచి జరుగుతున్నా ఆ మంచి జరగకూడదు, జరిగితే ఎక్కడ జగన్‌కు మంచి పేరు వస్తుందేమోనని చెప్పి ఏకంగా ఆ మనిషిని ఆపడం కోసమని చెప్పి రక,రకాల కోర్టు కేసులు వీళ్లే వేయిస్తారు.
 
రక,రకాల వక్రీకరణ రాతలు వీళ్లే పేపర్లలో, టీవీలలో రాస్తారు, చూపిస్తారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈ రెండున్నర సంవత్సరాల పరిపాలన కూడా మనస్ఫూర్తిగా, సంతృప్తినిచ్చే విధంగా చేయగలిగాను.
 
 
ఇంకా మంచి చేయడానికి కూడా వెనుకడుగు వేయను. మీ అందరి చల్లని దీవెనలతో ఇంకా మంచి చేస్తానని సవినయంగా తెలియజేస్తున్నానని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు