సీఎం జగన్‌కు ప్రపంచ ఆర్థిక సదస్సు ఆహ్వానం

సోమవారం, 16 మే 2022 (08:22 IST)
దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆహ్వానం వచ్చింది. పెట్టుబడుల అవకాశాలు, అంతర్జాతీయ అంశాలపై చర్చించేందుకు ఆయనకు ఆహ్వానం పలికారు. ఈ సదస్సు దావోస్‌ వేదికగా, మే 22 నుంచి 26 వరకు జరుగనుంది. 
 
అధికారిక వర్గాల ప్రకారం, సుస్థిర అభివృద్ధిని సాధించే ప్రయత్నాలను నొక్కి చెబుతూ, ఈ ప్రపంచ సదస్సులో ఆంధ్రప్రదేశ్  ప్రగతిని వివరించాలని ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా, తమ ప్రభుత్వ లక్ష్యాలు, స్థిరమైన లక్ష్యాలతో బలమైన ఆర్థిక వ్యవస్థగా మారడం వంటి అంశాలను వెల్లడిస్తారు. కాగా, ఈ సదస్సుకు మంత్రి గుడివాడ అమర్నాథ్‌తో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం కూడా పాల్గొననుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు