ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని సేవలను ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు పోర్టల్‌ను తీసుకొచ్చామని చెప్పారు. సిటిజెన్స్ సర్వీసెస్ పోర్టల్‌ను ప్రారంభించామని, దీనికి ఏపీ సేవ అనే పేరును పెట్టామని తెలిపారు.
గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటో అందరికీ తెలిసేనా గత రెండేళ్ళ కాలంలో అడుగులు ముందుకే వేశామని చెప్పారు. ప్రభుత్వ పథకాలు, సేవలను అందించడంలో గ్రామ, వార్డు సచివాలయాలు పని చేస్తున్నాయని తెలిపారు. ప్రజల సేవలో 4 లక్షల మంది సిబ్బంది ప్రజా సేవలో నిరంతరం నిమగ్నమైవున్నారని, గ్రామస్వరాజ్యానికి ఇంతకంటే నిదర్శనం లేదని సీఎం జగన్ అన్నారు.