స్వాతికి అధికారులు 687 నెంబరును కేటాయించారు. మొత్తం 13 మంది ఖైదీలు ఉన్న గదిలో ఆమెను కూడా ఉంచారు. కస్టడీ అనంతరం రిమాండ్ నిమిత్తం ఆమెను జైలుకు తరలించగా, తొలి రోజు ఉదయం ఆమె కాసేపు యోగా చేసిందని, ఆపై నిరక్షరాస్యులైన మహిళా ఖైదీలకు అక్షరాలు నేర్పిస్తూ, పాఠాలు చెప్పిందని అధికారులు చెప్పుకొచ్చారు.
ప్రియుడితో కలిసి జీవితం గడపడం కోసమే భర్తను చంపిన స్వాతికి కోర్టు రెండు వారాలపాటు రిమాండ్ విధించింది. సుధాకర్ రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితురాలైన స్వాతిని మహబూబ్ నగర్ మహిళా జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఇకపోతే.. స్వాతి ప్రియుడి వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. సుధాకర్ రెడ్డి మర్డర్ ప్లాన్ స్వాతిదేనని రాజేష్ పోలీసులకు చెప్పాడు.
స్వాతి దిండుతో నొక్కిపట్టుకోగా, తాను ఇనుపరాడ్‌తో కొట్టి చంపామని తెలిపాడు. తర్వాత కారులో మృతదేహన్ని ఫతేపూర్ అడవుల్లో తగలపెట్టామన్నాడు. ఇంటికి వచ్చాక యాసిడ్ దాడి జరిగిందంటూ డ్రామా ఆడామని వెల్లడించాడు. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని తన భర్తలా చలామణి కావాలని స్వాతినే కోరిందన్నాడు రాజేష్. సర్జరీకి కావాల్సిన డబ్బులును కూడా స్వాతినే సమకూర్చుతానందని పోలీసుల విచారణలో చెప్పుకొచ్చాడు.