కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి రెవెన్యూ, తదితర శాఖల అధికారులతో ప్రస్తుత పరిస్థితిపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ఇంతియాజ్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ.. జిల్లాలో 34 మండలాల్లోని 326 గ్రామాల్లో అధిక వర్షాల కారణంగా పంట నష్టం వాటిల్లిందని కలెక్టర్ అన్నారు.
ఇంతవరకు అందిన సమాచారం ప్రకారం 93,876 హెక్టార్లలో వరి, 150 హెక్టార్లలో ప్రత్తి, 45 హెక్టార్లలో వేరు శెనగ, 49 హెక్టార్లలో మినుము పంటలు పాడైనవని కలెక్టర్ అన్నారు. ఈ అధిక వర్షాల కారణంగా హార్డికల్పర్ పంటలకు సంబంధించి 348 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని కలెక్టర్ అన్నారు.
జిల్లాలో వర్షాల కారణంగా 11 ఇళ్లు, 5 కచ్చా ఇళ్లు దెబ్బతిన్నవని, ఒక కచ్చా ఇల్లు పూర్తిగా పాడైనదని, 4 పాకలు పూర్తిగా పాడైనవని కలెక్టర్ తెలిపారు. విద్యుత్ శాఖకు సంబంధించి 33/కెవి ఫీడర్లు 9. 11/కెవి ఫీడర్లు 32, 33/11 ఫీడర్లు 4, వర్షాల కారణంగా నష్టం వాటిల్లిందన్నారు.