అనంతరం బిళ్ళపాడు గ్రామంలోని వీదుల్లో అద్వాన్నంగా ఉన్న పారిశుధ్ద్య పరిస్థితులను గమణించిన కలెక్టరు గ్రామ పంచాయితీ కార్యదర్శి జనార్థరావును నిలదీచారు. ఏరోజు చెత్తను ఆరోజే డంపింగ్ యార్డుకు తరళించకుండా ఎందుకు వీదుల్లో ఉంచారని, ప్రజారోగ్యం మీకు పట్టదా.. ఎందుకు ఇంత అలసత్యం వహిస్తున్నారని కలెక్టరు హెచ్చరించారు.
కలెక్టరు వెంట ఆర్డీవో జి.శ్రీనుకుమార్,తాహశీల్థారు యం. శ్రీనివాసరావు, పంచాయితీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.