ఈ తుఫాను ప్రభావం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశాతోపాటు ఏపీ, తెలంగాణ, బెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా ఏపీ, ఒడిశాలోని పలు ప్రాంతాలకు తుపాను హెచ్చరికలు జారీ చేసింది.
ముఖ్యంగా, తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు గోదావరి జిల్లాలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనావేసింది.
ఇప్పటికే ఏపీ, ఒడిశాలకు తుఫాన్ హెచ్చరికలను జారీ చేసింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 70-80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది.