తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం... రేపు భారీ వర్షాలు

శనివారం, 25 సెప్టెంబరు 2021 (22:07 IST)
అల్పపీడన ప్రభావంతో  కోస్తాంధ్రలో నేడు, రేపు భారీ వర్షాలు పడనున్నాయి. కాగా, బంగాళాఖాతంలో తుఫాన్‌ దూసుకురానుంది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి శుక్రవారం ఉదయం అల్పపీడనంగా మారింది. ఇది క్రమంగా శుక్రవారం రాత్రి బలపడి వాయుగుండంగా మారింది. 

ప్రస్తుతం ఈ వాయుగుండం గోపాలపూర్‌కు ఆగ్నేయ దిశలో 670 కిమీ, కళింగపట్నానికి 740 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది తీవ్రవాయుగుండంగా మారి పశ్చిమ వాయువ్య దిశగా పయనించనుంది.ఈ వాయుగుండం క్రమంగా బలపడి శనివారం మధ్యాహ్ననికి తుఫాన్‌గా రూపాంతరం చెందనుందని  వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
 
ఆదివారం  సాయంత్రానికి విశాఖపట్నం గోపాల్‌పూర్‌ మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటనుంది. ఈ తుఫాన్‌కు పాకిస్తాన్‌ సూచించిన 'గులాబ్‌' పేరు పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

తుఫాన్‌ ప్రభావం వల్ల శని, ఆదివారాల్లో తీరం వెంబడి గంటకు 60 నుంచి 790 కిలోమీటర్లు, గరిష్టంగా 80 కి.మీ, సోమవారం 70 నుంచి 80 కి.మీ, గరిష్టంగా 90 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు సూచించారు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు