గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతుంది. ఈ తుఫాను రేపు అంటే ఈ నెల 18వ తేదీ తెల్లవారుజామున బంగ్లాదేశ్ తీరంలోని ఖెపుపారా వద్ద తీరం దాటనుంది. ఇది భూభాగంపైకి ప్రవేశించే సమయంలో బంగ్లాదేశ్ తీర ప్రాంతంలో గంటకు 80 కిలోమీటర్ల పైగా వేగంతో గాలులు విస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఉండదని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే, రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అమరావతి విభాగం వెల్లడించింది.