ఏపీకి పొంచివున్న మరో తుఫాను.. 23న అల్పపీడనం

ఠాగూర్

సోమవారం, 18 నవంబరు 2024 (10:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచివుంది. ఈ నెల 23వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 23వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం.. ఆ తర్వాత పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో తుఫాను దిశ మారే అవకాశం ఉదంని పేర్కొన్నారు. ఈ నెల 26 లేదా 27వ తేదీ నాటికి శ్రీలంక ఉత్తర దిశగా రానుందని పేర్కొన్నారు. 
 
దీని ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు, బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పుగాలుల ప్రభావంతో రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో రాయలసీమలో పలుచోట్ల, దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు