బిర్యానీలో బల్లి.. నెట్టింట వీడియో వైరల్.. ఎక్కడ?

సెల్వి

శుక్రవారం, 14 జూన్ 2024 (19:55 IST)
నిన్నటికి నిన్న ఐస్‌క్రీములో బొటన వేలు వున్న ఘటన సంచలనం సృష్టించింది. తాజాగా గుంటూరున బిర్యానీలో బల్లి కనబడిన ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. ఇలాంటి ఘటనలు
Dead Lizard Found in Biryani in Guntur
బయట ఆహారాన్ని తీసుకోవాలంటేనే జంకేలా చేస్తుంది. అసలే ఆహారంలో కల్తీ కారణంగా ఎన్నో షాకింగ్ వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తరుణంలో తాజాగా గుంటూరులో బిర్యానీలో బల్లి పడిన ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. 
 
గుంటూరు - అరండల్ పేటలోని ఓ బిర్యానీ పాయింట్లో ఓ వ్యక్తి పార్సిల్ కట్టించుకొని తీసుకువెళ్లాడు. ఇంటికి వెళ్లి పార్సిల్ విప్పి చూడగా బిర్యానీలో బల్లి ఉండటం చూసి షాక్ అయ్యాడు. వెంటనే వెళ్లి బిర్యానీ పాయింట్ నిర్వాహకులను అడిగితే దురుసుగా మాట్లాడి దుకాణాన్ని మూసి వెళ్లారని బాధితుడు వాపోయాడు.
 
అంతేగాకుండా దుకాణాదారులు దురుసుగా మాట్లాడటంతో ఇక దారి లేక వీడియో తీసి కస్టమర్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా దుకాణాదారుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

గుంటూరున బిర్యానీలో బల్లి

గుంటూరు - అరండల్ పేటలోని ఓ బిర్యానీ పాయింట్లో ఓ వ్యక్తి పార్సిల్ కట్టించుకొని తీసుకువెళ్లాడు. ఇంటికి వెళ్లి పార్సిల్ విప్పి చూడగా బిర్యానీలో బల్లి ఉండటం చూసి షాక్ అయ్యాడు.

వెంటనే వెళ్లి బిర్యానీ పాయింట్ నిర్వాహకులను అడిగితే దురుసుగా మాట్లాడి… pic.twitter.com/PENquHm7Ze

— Telugu Scribe (@TeluguScribe) June 14, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు