విపరీతంగా కురుస్తున్న మంచు సైనికులను పొట్టనబెట్టుకుంటోంది. జమ్మూకాశ్మీర్‌లోని గందేర్‌బాల్, బండిపొరా జిల్లాలోని గురెజ్ సెక్టార్ పరిధిలో మంచు కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతి చెందిన సైనికుల సంఖ్య 14కి చేరింది. వీరిలో ఓ తెలుగు జవాన్ కూడా మరణించినట్లు సైనికాధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం మరడాం గ్రామానికి చెందిన మామిడి నాగరాజు(25) భారత సైన్యంలో పనిచేశాడు.