బంగాళాఖాతంలో వాయుగుండం

బుధవారం, 6 నవంబరు 2019 (07:53 IST)
బంగాళాఖాతంలో నిన్నటి వరకు కొనసాగిన తీవ్ర అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది.

ఇది క్రమంగా బలపడి రాబోయే 24 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు తెలిపారు. ఒరిస్సా పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయంగా 950 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.

ఇది క్రమంగా బలపడి ఒరిస్సా లేదా పశ్చిమబెంగాల్ తీరం వైపు వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు