Tirumala: శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు- ఎన్డీయే ప్రభుత్వం పట్టించుకోదా? (video)

సెల్వి

బుధవారం, 2 జులై 2025 (12:13 IST)
తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు కొట్టింది. ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం తిరుమల శ్రీవారి గోపురం పై నుంచి విమానాలు వెళ్లడం విరుద్ధం. అలాంటి పరిస్థితుల్లో విమానాలు తరచూ తిరుమల కొండలపై చక్కర్లు కొట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
తిరుమల శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లైయింగ్ జోన్ అని ప్రకటించాలని భక్తులు కోరుతున్నా కేంద్రం పట్టించుకోవట్లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో వున్నప్పటికీ ఆలయంపై నుంచి విమానాలు వెళ్లడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. 
Tirumala
 
శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లైయింగ్ జోన్‌గా తీసుకురావడంతో ఏపీ సర్కారు విఫలమైందని భక్తులు మండిపడుతున్నారు. అలాగే టీటీడీకి ఉగ్రముప్పు పొంచివుందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నప్పటికీ.. తాజాగా శ్రీవారి ఆలయం పైనుంచి విమానం చక్కర్లు కొడుతుండటంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. 

తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు

ఆలయం పైనుండి విమాన రాకపోకలు సాగకూడదని ఆగమశాస్త్ర నిబంధనలు చెప్తున్నప్పటికీ, తరచూ శ్రీవారి ఆలయం పైనుండి విమానాలు వెళ్తుండటంతో అసహనం వ్యక్తం చేస్తున్న భక్తులు pic.twitter.com/tubmDsywWy

— Telugu Scribe (@TeluguScribe) July 2, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు