బెజ‌వాడ‌లో జోరుగా న‌ర‌కాసుర వ‌ధ‌... ఫెర్రీలో ఏర్పాట్లు

శనివారం, 29 అక్టోబరు 2016 (22:06 IST)
విజ‌య‌వాడ ‌:  చెడుపై మంచి సాధించిన విజ‌యంగా దీపావ‌ళిని నేత‌లు వ‌ర్ణిస్తుంటారు. పైగా న‌ర‌కాసురుడి వ‌ధ‌ను న‌ర‌క చ‌తుర్థినాడు నిర్వ‌హిస్తుంటారు. న‌వ్యాంధ్రప్ర‌దేశ్‌లో తొలిసారి న‌ర‌కాసుర వ‌ధ‌ను ఏపీ ప్ర‌భుత్వం ఓ కార్య‌క్ర‌మంగా చేప‌ట్టింది. కృష్ణా పుష్క‌రాల‌కు అభివృద్ధి చేసిన ఇబ్ర‌హీంప‌ట్నం ఫెర్రీ ఘాట్ వద్ద ఇందుకు ఏర్పాట్టు చేశారు. 
 
ఇక్క‌డ గోదావ‌రి కృష్ణా క‌లిసే ప‌విత్ర సంగమ ఘాట్ వ‌ద్ద రాష్ట్ర ప్ర‌భుత్వ లాంచ‌నాల‌తో న‌ర‌కాసుర వ‌ధ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఏపీ నీటిపారుద‌ల శాఖ మంత్రి దేవినేని ఉమ ద‌గ్గ‌రుండి జ‌రిపిస్తున్న ఈ న‌ర‌కాసుర వ‌ధ‌ను ఏపీ సీఎం చంద్ర‌బాబు నిర్వ‌హిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి