అల్ హుతైబ్ లో ఎండ, చలి మాత్రం తీవ్రస్థాయిలో ఉంటాయి. ఎంతో ఎత్తయిన కొండపై ఈ ఊరు ఉండడం వల్ల మేఘాలన్నీ ఈ ఊరు కిందిగా వెళుతుంటాయి. మేఘాలు కొండ కింది భాగంలో వర్షించేటప్పుడు ఈ ఊరి నుంచి స్పష్టంగా కనిపిస్తుంది.
దాంతో ఈ గ్రామం ఓ టూరిస్ట్ స్పాట్ గా మారిపోయింది. ప్రపంచం నలుమూలల నుంచి అల్ హుతైబ్ గ్రామాన్ని చూడడానికి పర్యాటకులు వస్తుంటారు. ఎత్తయిన ఈ కొండపై నిల్చుని, దిగువన ఉన్న మేఘాల నుంచి భూమ్మీదకు జాలువారే వర్షపాతాన్ని చూడడం ఓ మధురానుభూతిగా భావిస్తారు.