ఒకవైపు సూర్యకిరణాలు ఆ ప్రాంతంలో పడుతున్నప్పటికీ, అక్కడున్ననివాసాలు, చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న పచ్చని పంట పొలాలు ఏమాత్రం కనిపించని విధంగా మంచు దుప్పటి కప్పివేసింది. ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న ప్రకృతి సోయగాన్ని పలువురు వారి ఫోన్ లో బంధించుకుంటూ, ఉత్సాహంగా ప్రజలంతా గడుపుతున్నారు. చలి తీవ్రత సైతం ఎక్కువగా ఉండడంతో గజగజలాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయినా, ఈ వాతావరణాన్ని స్థానికులు ఎంజాయ్ చేస్తున్నారు.