ఇఫ్తార్ విందు ఆరగిస్తుంటే జగన్‌కు షాక్... రూ.749 కోట్ల ఆస్తుల జప్తు.. వాటి వివరాలు ఇవే...
గురువారం, 30 జూన్ 2016 (08:41 IST)
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అధికారులు తేరుకోలేని షాక్ ఇచ్చారు. వారం రోజుల పాటు లండన్‌లో విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత హైదరాబాద్‌కు తిరిగివచ్చి ఇఫ్తార్ విందు ఆరగిస్తున్న సమయంలో ఈడీ అధికారులు దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చారు. దీంతో ఆయన లండన్ పర్యటన సంతోషమంతా ఆవిరైపోయింది.
బుధవారం సాయంత్రం వైసీపీ మైనారిటీ విభాగం తెలంగాణ అధ్యక్షుడు మతీన్ ముజాయుద్దీన్ హైదరాబాద్‌లోని తన నివాసంలో ఇచ్చిన ఇఫ్తార్ విందుకు జగన్ హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. అప్పటిదాకా జగన్ ఉల్లాసంగా కన్పించారు. అదేసమయలో... జగన్‌కు చెందిన రూ.749 కోట్ల విలువైన ఆస్తులను జప్తు (అటాచ్) చేసినట్లుగా సమాచారం అందింది.
దీంతో క్షణాల్లో జగన్ హావభావాల్లో మార్పు కొట్టొచ్చినట్టు కనిపించింది. మీడియా ప్రతినిధులకు కూడా ఈ సమాచారం చేరింది. ఒక్క బెంగుళూరులోని ఆస్తుల విలువ రూ.500 కోట్లు ఉండగా, భారతీ షేర్ల విలువ రూ.2 వేల కోట్ల పైమాటగానే ఉంది. కాగా, గతంలో మూడు విడతల్లో 500 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసిన విషయం తెల్సిందే. కాగా, ప్రస్తుతం జప్తు చేసిన ఆస్తుల వివరాలను పరిశీలిస్తే (రూ.లక్షల్లో).
బెంగళూరులోని వాణిజ్య సముదాయం రూ.4945.63
గుంటూరులోని సరస్వతి పవర్స్‌కు చెందిన 903.28 ఎకరాల భూమి రూ.3184.42
హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ హౌస్ రూ.5689.72
నివిష్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రంగారెడ్డి జిల్లా
కాటేదానలోని సర్వే నెం. 101/ఈలోని 9680 చదరపు గజాల స్థలం రూ.811.32
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, సర్దార్ నగర్ రెవెన్యూ గ్రామంలోని సర్వే నెం. 10/2, 11/2, 18/1, 19/1, 20లో ఇన్‌స్పైర్ హోటల్ ప్రైవేట్
లిమిటెడ్‌కు చెందిన 32 ఎకరాల 31 గుంటల స్థలం. రూ.646.24
బెంగళూరు దేవనహళ్లి తాలుకా చెన్నరాయపట్న హుబ్లి, నల్లూరు గ్రామంలోని రేవలన ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన 9 ఎకరాల స్థలం. రూ.679.03
భగవత సన్నిధి ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన వర్తూర్ హుబ్లి, దేవరబీసనహళ్లి గ్రామంలోని సర్వే నెం. 55/1లోని 59,070 చదరపు అడుగుల స్థలం. రూ.264.54
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 జగన్ పత్రిక, టీవీ చానల్ ఉన్న సాక్షి టవర్స్ రూ.4370.4
మార్వెల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన అన్ని ఆస్తులు రూ.153.98
బెంగళేరులోని హరోహళ్లిలో సర్వే నెంబరు 195లోని 1 ఎకరం 30 గుంటలు రూ.906.5
సండూర్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన స్థలం, భవనాలు రూ.11849.71
వైఎస్ భారతి పేరు మీద రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని సర్వే నెంబరు 79/పి, 80/2లో ఉన్న 2500.69 చదరపు గజాల స్థలం. రూ.136.91
కడప జిల్లా సెట్టిగుంట గ్రామంలోని సర్వేనెం లోని 2588లో జెల్లా జగన్ మోహన్ రెడ్డి పేరిట ఉన్న స్థలం 27 ఎకరాలు. రూ.15.22
వైఎస్ భారతి పేరున ఉన్న క్లాసిక్ రియాలిటీ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన రూ.100 విలువ గల 6897 షేర్లు రూ.510.11
ల్యాంకో హిల్స్‌లోని జెల్లా జగన్ మోహన్ రెడ్డి పేరిట ఉన్న ఫ్లాట్ రూ.130.23