పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : అలయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్

శనివారం, 15 ఆగస్టు 2020 (21:03 IST)
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అలయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సీహెచ్ విజయలక్ష్మి అన్నారు. అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్  225  ఆధ్వర్యంలో బ్యూటిఫికేషన్, ప్లాంటేషన్ కార్యక్రమం జరిగింది.

ఆగస్టు 15 సందర్భంగా శనివారం విజయవాడ పెదపులిపాక చెరువుగట్టు చుట్టూ జరిగిన ఈ కార్యక్రమంలో అలయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సీహెచ్ విజయలక్ష్మి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. నగరంలో ,పల్లెల్లోనూ వాహనాల సంఖ్య పెరిగిపోవడంతో కాలుష్యం విపరీతంగా పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని  రోజురోజుకూ పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించాలంటే మొక్కలను పెంచడం ఎంతో అనివార్యమన్నారు.

ఐఓసీఎల్, ఎల్పీజీబీపీ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు అమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ గవర్నర్ కె. శారదావాణి, ఐఓసీఎల్ ఎల్పీజీ చీఫ్ ప్లాంట్ మేనేజర్, అలయన్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్ బి . ధన్ రాజ్ (కొండపల్లి) అలియన్స్ గ్రూపు జిల్లా పీఆర్వో రాజేశ్వరావు కొండా, ప్లాన్ టేషన్ సోషల్ సర్వీస్ డీసీ బషీర్ షేక్, ఫుడ్ చైర్మన్ అత్తులూరి విజయలక్ష్మి, అలయన్స్  శ్రావ్య, అలయన్స్ గ్రూపుల కార్యదర్శులు వీ .బీ. నాయుడు, లలితారాణి , రాధ,  హేమమాధవి , వాణి , శోభన్ బాబు, శ్రీధర్ ముసునూరి శ్రీనివాసరావు, బాబురావు, ఫరీద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు